శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో విగ్నేశ్వరుని దగ్గర అన్నదాన కార్యక్రమం

01-9-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం దగ్గర ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుని దగ్గర ఈరోజు పూజ కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో విగ్నేశ్వరుని దగ్గర పూజలో పాల్గొన్న దంపతులు శోభా రెడ్డి & ధర్మారెడ్డి వేద పండితులచే పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం వివిధ దంపతులు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో మహిళలలు ఉదయం నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వీరికి తోడు గా గ్రామస్తులు అనేక విధంగా సహాయ సహకారాలు అందిస్తూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈరోజు గ్రామంలో 500 మందికి పైబడి అన్నదానాన్ని చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి మహిళలు, గ్రామస్తులు చేసిన సహకారానికి శ్రీరామ యూత్ అసోసియేషన్ వారు అభినందనలు తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో శ్రీ రామా యూత్ తో పాటు, తెలంగాణ వార్త జర్నలిస్ట్ గుమ్మడం విష్ణు సాగర్, ధర్మారెడ్డి, అంబయ్య గారి పెద్ద కురుమయ్య, షేర్ పల్లి నాగరాజు, చిన్న కురుమయ్య, సింగోటం వెంకటేష్, మేకల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.