ఒక ఆడపిల్ల చదువు ఇంటి రూపురేఖలను మారుస్తుంది

తిరుమలగిరి 12 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
బాలికల కస్తూరి బా గాంధీ,బాలికల పాశఠశాల &కళాశాల తిరుమలగిరి నందు సూర్యాపేట జిల్లా మహిళా, శిశు, వికలాంగుల & వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం-2025 వ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం పాఠశాల &కళాశాల లో ప్రిన్సిపాల్ R.సుష్మిత అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు విచ్చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల సాధికారికత గురించి ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా భవిష్యత్తు ఆలోచనలు ఉండాలని , ఉన్నత విద్య ఉన్నత స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ జడ్జిలు, డాక్టర్స్ అందరూ కూడా గ్రామస్థాయి నుండి నిరుపేద కుటుంబం నుంచి వచ్చారన్నారు అనంతరం జిల్లా బాలల పరిరక్షణ యూనిట్. కౌన్సిలర్ శోభారాణి మాట్లాడుతూ పిల్లలకు అన్ని విధాల ఆదుకోవటానికి పిల్లల చట్టాలు బలంగా ఉన్నాయని తెలిపినారు. ఆడపిల్లల సంరక్షణ, చదువు ప్రాముఖ్యత, ఆడపిల్లలు ఈరోజు లో ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాల గురించి వివరించారు అనంతరం చైల్డ్ లైన్ 1098 కో. ఆర్డినేటర్. B. లింగయ్య మాట్లాడుతూ బాల్య వివాహం వాళ్ళ జరిగే అనర్ధాలు వాటి వల్ల నష్టాల గురించి చెప్పటం జరిగింది. ఆడపిల లు ఈరోజుల్లో అన్ని రంగాలలో ముందు ఉన్నారు అని, ఒక ఆడపిల చదువు ఇంటి రూపురేఖలను మారుస్తుంది, ఈ వయస్సులో తీసుకొనే కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన చాలామంది జీవితాలు కోల్పోయి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ R. సుష్మిత మాట్లాడుతూ పిల్లల సొంతగా ఆలోచించి విధంగా వుండాలి అని, ఇప్పటి నుండి ప్రణాళిక బద్దంగా చదువునే పద్ధతి అలవాటు చేసుకోవాలని చెప్పినారు. విద్యా అనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పటం జరిగింది. విద్యా వలన ప్రతి ఆడపిల్ల జీవితం వెలుగును చూడవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా ఈ కార్యక్రమంలో R. లక్ష్మణ్ చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సామజిక కార్యకర్త లక్ష్మయ్య పోలీస్ సిబ్బంది సిబ్బంది, బాలికల కస్తూరి బా గాంధీ, బోధన సిబ్బంది ,బాలికల కళాశాల బాలికలు పాల్గొనడం జరిగింది