దుర్గమ్మ సేవలో తెలంగాణ మంత్రులు..

Jul 10, 2024 - 19:55
 0  3

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం దర్శించుకున్నారు. వేదపండితులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. సోమవారం మంగళగిరిలో నిర్వహించిన వైఎస్సార్‌ 75వ జయంతి సభలో తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు పాల్గొన్న విషయం తెలిసిందే. దర్శనానంతరం భట్టి మాట్లాడుతూ ‘‘ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వ పాలనలో సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నాను. ప్రపంచంతో పోటీపడి అన్ని రంగాల్లో అభివృద్ధి  చెందేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నాను. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండే విధంగా దీవించాలని అమ్మవారిని కోరాను. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని ప్రార్థించాను’’ అని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333