**మాదకద్రవ్యాలు ఆరోగ్యానికి హానికరం""ఎస్సై సుధీర్ కోదాడ టౌన్ పిఎస్*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : మాదకద్రవ్యాలు ఆరోగ్యానికి హానికరం. SI సుదీర్, కోదాడ టౌన్ PS.
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు యువతకు పౌరులకు కార్మికులకు వివిధ వర్గాల వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఈరోజు కోదాడ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో కోదాడ పట్టణ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లకు మరియు హమాలి కూలీలకు మాదకద్రవ్యాల వల్ల జరిగే అనర్ధాలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబాల చిన్నాభిన్నం పిల్లలపై ప్రభావం మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా ఎస్సై సుధీర్ కుమార్ మాట్లాడుతూ రోజువారి కూలీ జీవనం గడుపుతున్న మీరు డ్రగ్స్ మత్తుకు అలవాటు పడితే ఆర్థికంగా నష్టపోయి అనారోగ్యం పాలయ్యి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని ఇలాంటి వాటి నుండి దూరంగా ఉండాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. కుటుంబ పెద్ద ఆరోగ్యం చినిస్తే ఆ కుటుంబం వీధిపాలవుతుందని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనలను ప్రజల సహకారం పోలీసు వారికి అవసరమని కోరారు. పిల్లల పట్ల దృష్టి పెట్టాలని పిల్లలు, యువత ఏదైనా కొత్త అలవాట్లకు లోనవుతున్నట్లయితే వారిని మందలించాలి అని అవసరమైతే డాక్టర్స్ ను, ఉపాధ్యాయులను, పోలీసు వారిని సంప్రదించి కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరారు. మత్తు పదార్థాలను ఉపయోగించడం వల్ల నాడీ వ్యవస్థ మెదడు వ్యవస్థ మనిషి అధీనంలో ఉండవు అన్నారు. మెదడు వత్తిడికి గురై అనారోగ్యం పాలు అవుతారు అన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎవరైనా ఉపయోగిస్తున్నా ఎవరైనా రవాణా చేస్తున్న ఎవరైనా విక్రయిస్తున్న అలాంటి సమాచారం స్థానిక పోలీసులకు ఇవ్వాలని డ్రగ్స్ నివారణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలని కోరారు.