ఉగాది విశిష్ట సేవ పురస్కారాలలో మానవత సేవా సారధి అవార్డు అందుకున్న ఉపాధ్యాయులు నీలం శేఖర్

అవార్డు రావడం పట్ల అభినందనలు

Mar 21, 2026 - 16:39
 0  8
ఉగాది విశిష్ట సేవ పురస్కారాలలో మానవత సేవా సారధి అవార్డు అందుకున్న ఉపాధ్యాయులు నీలం శేఖర్

రామన్నపేట 20 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఎన్నారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవ శాస్త్ర ఉపాధ్యాయులు నీలం శేఖర్ కి ఉపాధ్యాయులలో సామజిక సేవకి గుర్తింపుగా ఉగాది విశిష్ట సేవ పురస్కారాలలో మానవతా సేవా సారథి అవార్డు అందుకున్నారు.హైదరాబాద్ కళావేదిక ప్రాంగణంలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, గంగోత్రి కల్చరల్ ఫౌండేషన్ వారు ఆ సంస్థ వ్యవస్థపాక అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ మరియు పారిజాత ఉమ్మడి తెలుగు రాష్టాలో ఉపాధ్యాయులలో ముగ్గురిని గుర్తించి వారికి అవార్డు అందించి సన్మానం చేయడం జరిగింది, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ అనేక సామాజిక సంస్థలలో భాగస్వామ్యం అయితూ సామజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, దానిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులకి ప్రేరణ కార్యక్రమాలు, ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకి సహాయ కార్యక్రమాలు, ప్రభుత్వ పేద విద్యార్థులకి అండగా ఉంటూ ఎన్నో సహాయ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారు వారి సేవలని ప్రశంసించారు, కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు,సినీ గాయకులు,వివిధ రంగాల నుండి ప్రముఖులు పాల్గొని అనంతరం మన మండల వాసికి ఈ అవార్డు రావడం పట్ల పలువురు  అభినందనలు తెలిపారు. సర్పంచ్ దాస్య నాయక్, ఎక్స్ ఎన్ సీఐ సైదులు గౌడ్, డిగ్రీ కాలేజ్ అసోసియేమెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాక్ల, లెక్చలేర్ కుంభజడ వీరబాబు, ప్రముఖ జర్నలిస్ట్ ఆరిఫ్ బాయ్, ప్రభుత్వ ఉపాధ్యాయులు దత్తు వీరశేఖర్, సత్తయ్య గోపి ఉసేన్ వెంకటేశ్వర్లు మాధవ్ జైలు వార్డెన్ తిరుమల యాదవ్ పోలీస్ కానిస్టేబుల్ వెంకటేష్ జిఎల్ఎం రాగ్య , నావి వెంకట్ శ్రీను మీసేవ రాజు ప్రముఖ డయాగ్నెట్ కుమార్, ప్రముఖ సామాజిక సంకర్తలు డాక్టర్ వంశీ పీహెచ్డీ, వేముల సైదులు పల్లె అంజి, శ్రీను నాయక్, రామకృష్ణ, డప్పు కళాకారులు మైబు హెడ్మా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333