తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.... కొప్పుల జైపాల్ రెడ్డి

మునగాల 24 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- నల్గొండ,ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు భారీ విజయాన్ని అందిద్దామని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి తీన్మార్ మల్లన్న కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టభద్రులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రజా గొంతుకను చట్టసభలో వినిపించేందుకు తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ చేద్దామని అన్నారు. ప్రతి గ్రామంలో కమిటీగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాసర్ల కోటయ్య, మాజీ సర్పంచ్ చింతకాయల ఉపేందర్, శెట్టి గిరి, రామంజి, రషీద్, పంది జాను,తదితరులు పాల్గొన్నారు.