మానవ రూపంలో తియ్యదుంపలు

అడ్డగూడూరు 11 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల పరిధిలోని చౌడుపల్లి గ్రామంలో ఒక విశేషం చోటుచేసుకుంది.రైతు పొలంలో పండిన తియ్యదుంపలు(చిలకడ దుంపలు)మానవ రూపాన్ని పోలి ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
గ్రామస్తులు ఆసక్తిగా వీటిని చూడటానికి తరలివస్తున్నారు.కొందరు ఇవి సహజ ప్రకృతి అద్భుతమని భావిస్తే, మరికొందరు దీన్ని దేవుని సంకేతంగా భావిస్తున్నారు.రైతు కుటుంబం కూడా ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి తమపొలంలో మరి ఎప్పుడు పండలేదని గుర్తు చేశారు.తియ్యదుంపలు మానవ ముఖం,చేతులు,కాళ్ల ఆకృతుల్లా కనిపించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.