అభివృద్ధి పనులు నెల లోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ సంతోష్
జోగులాంబ గద్వాల 8 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :- అయిజ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు సూచించారు.బుధవారం అయిజ లో పర్యటించి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించారు.30 పడకల ఆసుపత్రి, పెద్దవాగుపై నిర్మించిన బ్రిడ్జి పనులు ఇరువైపులా బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు.అలాగే సిసి రోడ్లు మంజూరు కొరకు పలుచోట్ల పరిశీలించారు పనులు అలాగే సమీకృత మార్కెట్ లోకి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు నుండి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.