తాడి చెట్టు పై నుండి పడిన గీత కార్మికునికి గాయాలు

Jan 9, 2025 - 19:13
Jan 9, 2025 - 19:20
 0  2
తాడి చెట్టు పై నుండి పడిన గీత కార్మికునికి గాయాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ :- తాడి చెట్టు పై నుండి పడిన గీత కార్మికునికి గాయాలు ఆత్మకూరు ఎస్ మండలం లోని నిమ్మికల్ గ్రామానికి చెందిన మడ్డి రాములు వయస్సు 39 గురువారం సాయంత్రం రోజు మాదిరి గానే తాడి చెట్టు ఎక్కుతుండగా ప్రమాద వశాత్తూ జారీ కింద పడీ తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడు ప్రస్తుతం ఏరియా ఆసుపత్రికి చికిత్స పొందుతున్నాడు. అతనికి ప్రభుత్వం నుండి 10 లక్షలు ఎక్సు గ్రెషియ ఇవ్వాలని కల్లు గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజి బాబు సొసైటీ అధ్యక్షులు చవగాని మల్లయ్య డిమాండ్ చేశారు.