భూమి సునీల్ సారథ్యంలో లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ భూమి సునీల్ సారథ్యంలో లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు చట్టాలను చుట్టాలు చెయ్యడమే లక్ష్యంగా సాగు న్యాయ యాత్ర చట్టం రైతుకు చుట్టం కావాలి వ్యవసాయ,రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ గారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు లక్ష మంది రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించడం , రైతుల న్యాయ అవసరాలపై అధ్యయనం చెయ్యడం కోసం లీఫ్స్ సంస్థ బృందం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 28 నుండి అక్టోబర్ 2 వరకు ఎనిమిది వెయ్యి గ్రామాల మీదుగా 2400 కిలోమీటర్లు పర్యటించనున్నదని వ్యవసాయ,రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ గారు అన్నారు. శుక్రవారం ఆత్మకూర్ రైతు వేదికలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారితో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దుక్కి దున్నే నాటి నుండి పండించిన పంటను మార్కెట్లో అమ్మేదాకా రైతులు ఎదుర్కునే సమస్యలు ఎన్నో. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, మారుతున్న సవాళ్లకు తగ్గట్టుగా సాగు సాఫీగా సాగడం కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. భూమి మరియు వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో రెండు వందలకు పైగా చట్టాలు అమలులో ఉన్నాయి. వీటిని తెలుసుకొని వినియోగించుకొగలిగితెనే ఏరువాక సాగే పరిస్థితి. భూమి సమస్యలు ఉత్పన్నమైనపుడు; నాణ్యతలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లినప్పుడు; మార్కెట్ మోసాలు జరిగినప్పుడు; పంటల భీమా అందనప్పుడు ఇలా పలు సందర్భాలలో రైతులకు చట్టాలతో అవసరం ఏర్పడుతుంది. అందుకే, ప్రతి రైతుకు చట్టాలు తెలియాలి. ఆ చట్టాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలి. తెలంగాణాలోని లక్ష మంది రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యం తో భూమి సునీల్ సారథ్యంలో నడుస్తున్న లీఫ్స్ సంస్థ సాగు న్యాయ యాత్రను ప్రారంభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా లీఫ్స్ బృందం జూన్ 28 నుండి అక్టోబర్ 2 వరకు ఎనిమిది వెయ్యి గ్రామాల మీదుగా 2400 కిలోమీటర్లు పర్యటించి పదివేల మంది రైతులను నేరుగా కలిసి, వారికీ కీలకమైన వ్యయవసాయ చట్టాలను వివరిస్తుంది. భూమి, విత్తనం, సాగు నీరు, పంట రుణాలు, పంటల భీమా మరియు వ్యయవసాయ మార్కెట్లకు సంబంధించి అమలులో ఉన్న కీలక చట్టాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని రైతులకు అందజేస్తుంది. ఈ పదివేలమంది తలా ఒక పది మందికి ఈ విషయాలు తెలియజేసేలా ప్రయత్నం చేస్తుంది. ఈ యాత్రలో భాగంగా రైతుల న్యాయ అవసరాలపై అధ్యయనము చేస్తుంది. ఈ అధ్యయనం రైతులకు మెరుగైన ఉచిత న్యాయ సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి అధ్యయనం చెయ్యడం, రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించడం, ఈ రెండు వినూత్న ప్రయత్నాలు దేశంలోనే మొదటిసారి అని అన్నారు. అనంతరం మండల తహసిల్దార్ కార్యాలయంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు.