మున్సిపాలిటీలో ముమ్మారంగా పారిశుద్ధ్య పనులు

తిరుమలగిరి 09 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య పనులను ముమ్మారంగా చేపట్టారు 8వ వార్డు లో మురికి కాలువలను జెసిబి సాయంతో కాలువలో నిల్వ ఉన్న చెత్త చెదరని తొలగించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ శాగంటి అనసూయ రాములు మాట్లాడుతూ తిరుమలగిరి మున్సిపల్ ప్రజలందరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందజేసిన తడి చెత్త మరియు పొడి చెత్త డస్ట్ బిన్లను వాడి పర్యావరణం కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. ప్రజలు తమ వంతు బాధ్యతగా మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని కోరారు. చెత్తను మురుగు కాలువల్లో వేయకుండా చెత్త బండి లోనే వేయాలన్నారు. తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మందుల సామెల్ వారి సహకారంతో పారిశుద్ధ్య పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్స్ గుగులోత్ భాస్కర్ నాయక్ చిర్రబోయిన హనుమంతు వార్డు ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు