గానుగుబండ గ్రామంలో తన ఉదార స్వభావంతో నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఓబీసీ సెల్ రుద్ర రామచంద్రు

Mar 4, 2024 - 19:10
 0  5
గానుగుబండ గ్రామంలో తన ఉదార స్వభావంతో నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఓబీసీ సెల్ రుద్ర రామచంద్రు

తుంగతుర్తి :మర్చి:03 తెలంగాణ వార్త ప్రతినిధి:-  గానగుబండ గ్రామంలో మొన్న జరిగిన షార్ట్ సర్క్యూటివ్ వల్ల నష్టపోయిన నిరుపేద కుటుంబానికి ఓబీసీ సెల్ అధ్యక్షుడు రుద్ర రామచంద్రు ఆదివారం నాడు తన ఉదార స్వభావంతో 5000/- రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఇవి కాక గ్రామ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి వాళ్లను కూడా ఒప్పించి 7800/- కలిపి మొత్తం ఆ కుటుంబానికి అందజేశారు. గ్రామంలో ఏ సమస్య వచ్చిన గ్రామంలో నేనున్నా అంటూ ముందు నడిచి గ్రామ ప్రజలకు నిరంతరం సేవలు చేస్తూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్య తన సమస్యగా భావించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.

 
    ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు బోర జలంధర్, ఉపాధ్యక్షులు పంజాల వెంకన్న గ్రామ శాఖ మహిళా అధ్యక్షురాలు మట్టపల్లి కాలమ్మ గ్రామ శాఖ మహిళా ప్రధానకార్యదర్శి బొల్లోజు జానకమ్మ,వీరబోయిన పద్మ లింగయ్య , కట్టకింది సోమన్న, జక్కుల వెంకన్న, జట్టంగి నరసయ్య, మద్దెల నర్సయ్య,భూపతి వెంకటేష్, జటంగి పరమేష్, ఎనగందుల మధుసూదన్, అబ్బగాని వేణు, తీగల శ్రీనివాస్, పంజాల సంతోష్, దాతలు సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333