9న CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గద్వాలకు రాక

Jun 7, 2025 - 14:48
 0  3
9న CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గద్వాలకు రాక

జోగులాంబ గద్వాల 6 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. ఈ నెల 9వ తేదీ సోమవారం  జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథి గా CPM తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ హాజరవుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి A.వెంకటస్వామి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలోA.వెంకటస్వామి మాట్లాడుతూ....... 9వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని అనంత కన్వెన్షన్ హాల్ లో సిపిఎం జిల్లా విస్తృత సమావేశం ఉంటుందని, సమావేశానికి ముందు రూరల్ పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ చౌక్, కొత్త బస్టాండు, పాత బస్టాండ్ మీదుగా అనంత కన్వెన్షన్ హాల్ వరకు బైకులతో ర్యాలీ ఉంటుందని తెలిపారు. జాన్ వెస్లీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా గద్వాలకు చేస్తున్నారని వారితోపాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు R. శ్రీరామ్ నాయక్ మరియు MV. రమణ కూడా హాజరవుతున్న తెలిపారు. జిల్లాలోని CPM పార్టీ సభ్యులు మరియు సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని A.వెంకటస్వామి పిలుపునిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333