*ప్రతిభ కు ఘన సన్మానం

Oct 12, 2025 - 06:30
 0  2
*ప్రతిభ  కు ఘన సన్మానం

 తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ . ఆత్మకూరు గ్రామంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని మేడి పౌండేషన్ ఆద్వర్యం లో శనివారం ఘనంగా సన్మానించారు. నెమ్మికల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలో గ్రూప్ 1 లో ఉత్తమ ర్యాంక్ సాధించిన ఆవుల సతీష్, మెడిసిన్ లో సీటు సాధించిన విద్యార్ధినులు యాతాకుల శ్రీజ, యాతకుల అక్షర, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గా ఎంపిక అయిన సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎన్నికైన గిలకత్తుల యల్లా గౌడ్, ను మేడి పౌండేషన్ ఆద్వర్యం లో స్థానిక ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ అధ్యక్షుడు మేడి కృష్ణ, యాదగిరి, వెంకట్ రెడ్డి, మల్లేశ్, మల్సూర్, కృష్ణారెడ్డి, ఆవుల వెంకన్న, గుణగంటి వెంకన్న, అశోక్ యాతకుల వెంకన్న ,బొడ్డు శ్రీను, పర్వతాలు, ఎల్లయ్య, బైరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.