**డివిజన్ ను అభివృద్ధి చేయండి""మంత్రి తుమ్మల*
తెలంగాణ వార్త ప్రతినిధి : డివిజన్ అభివృద్ధికి కృషి చేయండి .... మంత్రి తుమ్మల
కాంగ్రెస్ పార్టీ లో చేరిన కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ దంపతులు ఈరోజు క్యాంపు కార్యాలయంలో గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ ను అభివృద్ధి పధంలో నడిపించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునకొల్లు నీరజ గారు, DCC అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు, కార్పోరేటర్లు కమర్తపు మురళి గారు, మలీదు వెంకటేశ్వర్లు గారు, లకావత్ సైదులు గారు నాయకులు సాధు రమేష్ రెడ్డి గారు, పాలెపు వెంకటరమణ గారు, డివిజన్ అధ్యక్షుడు షేక్ రజ్జి, నాయకులు బాల్దె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు