పల్లె వెలుగులేప్పుడో?

Jun 18, 2024 - 20:32
Jun 18, 2024 - 20:38
 0  14
పల్లె వెలుగులేప్పుడో?

జోగులాంబ గద్వాల 17 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- -పల్లెల శాపమో... అధికారుల కోపమో... కానీ నేటికీ అనేక గ్రామాలు పల్లె వెలుగు బస్సులు ఎరుగవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బస్సు నిండ ప్రయాణికులు ఎక్కక నష్టాలు సంభవిస్తున్నాయని. మినీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. అయితే బస్సు ఎరగని పల్లెలకు ఈ మినీ బస్సులు ఎంతగానో ఉపయోగం....అలాంటి మినీ బస్సులు ఉన్న పల్లెలకు మాత్రం రావడం లేదు. జిల్లాలో గిరిజన ప్రాంతాలు కేటి దొడ్డి మండలంలోని ఉమిత్యాల తండా, పూజారి తాండ రెండు ప్రాంతాలు. ఎన్నో ఏళ్లుగా గతంలోని ఎర్ర బస్సు ఎరగని పల్లెలు సబ్ డివిజన్ సాక్షాలుగా మిగులుతున్నాయి.? కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన పక్క రహదారులు బస్సులు ఎరగని పల్లెలు ఉండటం విశేషం. ఈ గ్రామాల నుంచి తమ పంట ఉత్పత్తులు తరలించడం, అవసరమైన ఎరువులు తీసుకుని వెళ్ళటం, విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లి  ఉన్నత చదువులు చదువుకోవడానికి పల్లె ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు.? ఒకనాడు మార్ముల పల్లెకు వెళ్లిన బస్సులు కూడా పల్లెలకు వెళ్లడం లేదు. వసూలు ఎరగని మరికొన్ని ప్రాంతాలు జోగులాంబ గద్వాల జిల్లాలోని అల్లంపూర్ కాంసెన్సీలో వల్లూరు ధర్మవరం రాజోలి మండలంలోని మాన్ దొడ్డి , పెద్ద ధన్వాడ, ఐజ మండలంలోని పులికల్ రాజాపురం, గట్టు మండలంలోని చాగదోన చిన్నంపల్లి, తదితర  గ్రామాలకు సైతం పల్లె వెలుగు బస్సులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..?
బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు.
జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం, రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామం నుండి మాన్ దొడ్డి గ్రామానికి చదువుకోవడానికి విద్యార్థులు ప్రతి సంవత్సరం దాదాపు గా 60 నుంచి 70 మంది విద్యార్థుల వరకు వెళుతుంటారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు తప్పని తిప్పలు. బడులు ప్రారంభమయ్యాయి మా గ్రామానికి బస్సు వేయండి అని గత రెండు, మూడు రోజుల క్రితం గ్రామ పెద్దలు మాన్ దొడ్డి నుండి వెళ్లి బస్సు డిపో మేనేజర్ ను కోరడం జరిగింది. కానీ పచ్చర్ల నుండి స్కూలుకు వెళ్లడానికి ప్రతిరోజూ బస్సు వస్తుందని విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. చివరికి బస్సు రాకపోవడంతో కిరాయి ఆటోలో స్కూలుకు వెళ్లడం జరిగింది. మరి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ విద్యార్థుల చదువుల గురించి ప్రభుత్వాలు ఆలోచించక తప్పదు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333