టైక్వాండో కరాటే ఛాంపియన్షిప్ అవార్డుల ప్రధానోత్సవం

Jul 13, 2024 - 17:01
Jul 13, 2024 - 19:24
 0  28

జోగులాంబ గద్వాల 14 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి గద్వాల:- థాయిక్వండో  బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో జరిగింది. టైక్వాండో కరాటే అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు దేవిదాస్ హాజరై టైక్వాండో క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్,కప్ లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకుంటే ఆత్మ రక్షణ కొరకు ఉపయోగపడుతుందని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో శ్రీహరి కరాటే విద్యకు పెద్దపీట వేసి అహర్నిశలు కృషి చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు శ్రీహరిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డివైస్ ఓ బి ఎస్ ఆనంద్ షేక్షావలి ఆచారి నారాయణ గౌడ్ జహీరుద్దీన్ కృష్ణ నాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333