టి ఆర్ పి పార్టీలో చేరిన బిజెపి నాయకుడు అబ్దుల్ అజీజ్

Jan 30, 2026 - 11:53
Jan 30, 2026 - 14:56
 0  6

సూర్యాపేట వార్త తెలంగాణ 30-01-26:

ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యపేట జిల్లా కార్యాలయంలో బీజేపీ సూర్యాపేట జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ అజీజ్ (సూర్యాపేట జిల్లా, కుమ్మరి బజార్‌) బీజేపీ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం జరిగింది . 

ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ శ్రీ వట్టె జానయ్య యాదవ్  అబ్దుల్ అజీజ్ కి పార్టీ కండువా కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా శ్రీ వట్టె జానయ్య యాదవ్  మాట్లాడుతు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సామాన్యుడి పార్టీ అని, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే దిశగా నిరంతరం కృషి చేసే పార్టీ అని పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతు సామాజిక న్యాయం, ప్రజల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా పనిచేసే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం గర్వంగా ఉందని తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య గారు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Santosh chakravarthy తెలంగాణ వార్త సీనియర్ జర్నలిస్టు 8500686136