విద్యార్థులతో కలిసి హెల్మెట్ స్టిక్కర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Jan 30, 2026 - 08:13
Jan 30, 2026 - 10:38
 0  6

తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం తేది: 29/1/2026.

పాఠశాల విద్యార్థులతో కలిసి హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగం, వేగ నియంత్రణ పై పోస్టర్లు, స్టిక్కర్స్ అవిష్కరించిన ఎస్పి నరసింహ ఐపిఎస్ .

రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, నియమ నిబంధనలు పాటించడం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని చుట్టుప్రక్కల వారిని చైతన్యవంతం చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు తెలిపారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా సూర్యాపేట పట్టణానికి చెందిన ఎమ్మెస్సార్ పాఠశాల యజమాన్యం విద్యార్థులు చేపట్టిన రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టడం చాలా మంచి ఉద్దేశమని వారిని అభినందించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి అంటూ రూపొందించిన పోస్టర్లను సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. హెల్మెట్ ధరించడం సీటు బెల్టు పెట్టుకోవడం అతివేగాన్ని నివారించడం వంటి పోస్టర్లను విద్యార్థులతో కలిసి ఎస్పీ గారు ఆవిష్కరించారు.

విద్యార్థులు నిరంతరం శ్రమించాలని, కష్టపడి చదువుకోవాలని ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్లాలని కోరారు, నిత్యం శ్రమించే వారు జాతి శ్రేయస్సు కోసం జాతి రక్షణ కోసం పాటుపడతారని తెలిపారు. రోడ్డు భద్రత పట్ల తల్లిదండ్రులను చుట్టుపక్కల వారిని చైతన్యవంతం చేయాలని ప్రతి ఒక్క విద్యార్థి అంబాసిడర్ గా ఉండాలని కోరారు. విద్యార్థులు రోడ్డు భద్రతను ఇంటి నుండే ప్రారంభించాలని ద్విచక్ర వాహనం పై ప్రయాణం చేసే సమయంలో తల్లిదండ్రులు హెల్మెట్ పెట్టుకునేలా తెలియజేయాలని అన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం గురించి వివరించాలని తెలిపారు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవ్యాలు తల్లిదండ్రులను గౌరవిస్తూ పిల్లలు వారి ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. మంచి చెడులపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఎవరైనా వేధింపులకు గురి చేసినట్లయితే అలాంటి వారి గురించి తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని వేధింపులను ఉపేక్షించకూడదు పోలీసు వారికి ఫిర్యాదు చేసి సమస్యను ఆదిలోనే అణచివేయాలని కోరారు. పోక్సో చట్టం గురించి తెలియజేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తూచా తప్పకుండా పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు ప్రమాద రహిత జిల్లాగా సూర్యాపేటలో చూపించడం అందరి బాధ్యత అని కోరారు.ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదిత్య, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎమ్మెస్సార్ పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, పాటశాల విద్యార్థులు ఉన్నారు.

కార్యక్రమం అనంతరం పాఠశాల విద్యార్థులు సూర్యాపేట పట్టణ ముఖ్య కూడలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాలంటూ వాహనాలకు స్టిక్కర్లను అంటి పెడుతూ అవగాహన కల్పించారు.

Santosh chakravarthy తెలంగాణ వార్త సీనియర్ జర్నలిస్టు 8500686136