జూరాల కాల్వపై అక్రమ రేకుల షెడ్ల కూల్చివేత

హైడ్రా దెబ్బకు 11 రేకుల షెడ్లు తొలగింపు
చిన్నంబావి మండలం 25సెప్టెంబర్ 2025తెలంగాణ వార్త : చిన్నంబావి మండల కేంద్రంలోని జూరాల కాల్వపై అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్లపై రెవెన్యూ, పోలీస్ శాఖలు గురువారం కఠిన చర్యలు చేపట్టాయి. వనపర్తి చెందిన మొరం సతీష్ కాల్వపై 11 రేకుల షెడ్లను ఏర్పాటు చేసినట్లు గుర్తించడంతో, అధికారులు ఉదయం నుంచే సిబ్బందిని మోహరించి, జేసీబీతో కూల్చివేత చర్యలు ప్రారంభించారు. హైడ్రా యంత్రం గర్జనలతో ఒక్కొక్కటిగా రేకుల షెడ్లు కూలిపోతుండగా, ఆ పరిసర ప్రాంతంలో జనసందోహం ఏర్పడింది. షెడ్లు కూల్చివేత దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ “కాల్వపై ఇంత పెద్ద ఎత్తున షెడ్లు ఎలా కట్టారో ఇప్పుడైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం మంచిదే” అన్నారు. మరికొందరు “కాల్వపై కట్టడాల వల్లగుణల్లో నీటి ప్రవాహం చెత్తాచెదారం పేరుకుపోయి నీటి ప్రవాహం ఆగిపోతుంది. కాబట్టి ఈ చర్య సమయోచితమైంది” అని అభిప్రాయపడ్డారు. రైతులు రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ, ప్రజా వనరులపై ఎవరూ అక్రమ నిర్మాణాలు చేయరాదని హెచ్చరించారు. “కాల్వలు ప్రజలందరికీ చెందినవే. ఎవరైనా స్వప్రయోజనాల కోసం వాటిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు” అని వారు స్పష్టం చేశారు.పోలీసు బలగాలతో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అధికారులు తెలిపారు