మా చిన్ననాటి జ్ఞాపకం మా ఇల్లు మాకే కావాలి

Jul 8, 2024 - 20:25
 0  3
మా చిన్ననాటి జ్ఞాపకం మా ఇల్లు మాకే కావాలి
మా చిన్ననాటి జ్ఞాపకం మా ఇల్లు మాకే కావాలి

4-1-6 ఇంటి నెంబర్ గోపి కృష్ణది అయితే అతనికి ఇచ్చేయండి

4-1-5 మా నాన్న కుంజ వెంకట్ ఇల్లు మాకు అప్పచెప్పండి

తప్పుడు పత్రాలతో ఉన్నతాధికారులనే తప్పుదారి పట్టించారు

వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి 

పంచాయతీ సెక్రటరీ పై చర్యలు తీసుకోవాలి

పక్కింటి నెంబర్ తో తప్పుడు పత్రాలతో సొంతం చేసుకున్న ఇల్లు

వెంటనే మా స్థలంలో ఉన్న షాపుని కాలి చేపించాలి

భద్రాద్రి కొత్తగూడెం జూలై 8 ( ) జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ప్రజావాణి కార్యక్రమంలో  అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి మా నాన్న ద్వారా వచ్చిన ఆస్తిని అధికారుల అండదండలతో రక్తసంబంధీకుడే మోసం చేశారంటూ మాకు న్యాయం చేయండి అంటూ ప్రజావాణిలో  ఫిర్యాదు అందజేసిన పాల( కుంజ ) వెంకట్  కొడుకులు కుమార్తెలు.  పూర్తి వివరాల్లోకి వెళితే కల్తీ లలిత బొల్లి కనకదుర్గ కుంజా సమ్మయ్య కుంజ సారయ్య తండ్రి పేరు కుంజ వెంకట్ (పాల వెంకటి). అను మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన 180 గజాల మా స్థలంలో ఎస్ కే టి వారు షాపింగ్ కట్టినారు.

 ఆ షాపింగ్ తొలగించి మా జ్ఞాపకమైనమా స్థలాన్ని మాకు అప్పచెప్పాలంటూ కోరుతున్న పాల వెంకట్ బిడ్డలు కొడుకులు. మా అందరికీ ఉండే ఒకే ఆధారం మా నాన్న సంపాదించిన ఈ మా ఇల్లు మాత్రమే.మా తండ్రి కుంజ వెంకటి తండ్రి పేరు కుంజా రామస్వామి కులము కోయ ( పాల వెంకట్ పాల వ్యాపారం చేసేవారు) 1970 వ సంవత్సరం నుండి ఇంటి నెంబర్ 4- 1-5 అనే ఇంటి నెంబర్ లో చిన్ననాటి నుండి ఇక్కడే ఉండే వారం.మా నాన్న 21- 11- 2005 లో చనిపోయినారు. మా ఎవరికి తెలియకుండా మా తమ్ముడు  కుంజ గోపికృష్ణ తండ్రి కుంజా వెంకట్ విద్యానగర్ పంచాయతీలో మా నాన్న కుంజ వెంకట్ వీలునామ గోపి కృష్ణకు రాసినట్టు నకిలీ పత్రాలు వీలునామా సృష్టించి తప్పుడు పత్రాలతో పంచాయతీ అధికారులతో కుమ్మక్కై కుంజ గోపి పేరు మీద 4-1-5 అనే ఇంటి నెంబర్ గల మా ఇంటిని 4-1-6 పడమర నివసించే జానీ వాళ్ళ ఇంటి నెంబర్ పెట్టుకొని    నకిలీ పత్రాలు సృష్టించి గోపికృష్ణ పేరుమీద మార్చుకోవడం జరిగింది. ఇక్కడ మా ఇంటి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు ఇది ఆపవలసిందిగా పంచాయతీ సెక్రటరీకి సమాచార శాఖ ద్వారా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది

 కానీ సెక్రటరీ మా అభ్యర్థనను తిరస్కరించడం జరిగింది. మేము 2-7- 2023లో కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ కలెక్టర్ ని కూడా తప్పుడు పత్రాలతో తప్పుదారి పట్టించినారు.మా నాన్న ఆస్తిలో మేము అందరము వాటాదారులమే. మా నాన్న డెత్ సర్టిఫికెట్  పాల వెంకట్ పేరు మీద ఇంటి నెంబర్ 4-1-6 అని వ్రాసి ఉన్నది మేము కోయ జాతికి చెందిన వారము మా నాన్న కుంజ వెంకట్. అధికారులు ఏ విధంగా పాల వెంకట పేరు మీద డెత్ సర్టిఫికెట్ ఇచ్చినారు అర్థం కాని పరిస్థితి ఉన్నది. తప్పుడు వీలునామా సృష్టించి 4-1-6 అనే ఇంటి నెంబరు వీలునామాలో సృష్టించి గోపికృష్ణ పేరుమీద మార్చడం జరిగింది. మా ఇంటి నెంబర్ 4- 1-5 అని తెలియజేయుచున్నాను.4-1-6 అరే ఇంటి నెంబర్ మా ఇంటి పడమర జానీ ది. దొంగ పత్రాలతో అధికారులతో కుమ్మక్కై మా ఇంటిని గోపికృష్ణ స్వాధీనం చేసుకున్నాడు.  దొంగ పత్రాలలో పాల గోపికృష్ణ అని సృష్టించినారు వాస్తవానికి కుంజ గోపికృష్ణ ఆధార్ కార్డులో రేషన్ కార్డులో ఓటు కార్డులో కూడా కుంజ గోపి అని  ఉన్నది .

 మీ నుండి మేము కోరేది తప్పుడు పత్రాలు సృష్టించి డబ్బులకు అమ్ముడుపోయి గోపి కృష్ణ పేరు మీద ఉన్న ఇంటిని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుచున్నాము గోపికృష్ణ ఆధార్ కార్డు రేషన్ కార్డు పరిశీలిస్తే కానీ నిజాలు వెలుగులోకి వస్తాయని..మా ఇంటి స్థలంలో షాపింగ్ కట్టినారు ఆ షాపును కాలి చేపించి మాకు న్యాయం చేయగలరు. ఇటువంటి దొంగ పత్రాలు సృష్టించి కలెక్టర్ నీ సైతం తప్పుదోవ పట్టించిన విద్యానగర్ పంచాయతీ సెక్రటరీ మండల అధికారి  పై చర్యలు తీసుకొని మరల ఇటువంటి పునరావృత్తం కాకుండా వీరిపై చర్యలు తీసుకొని ప్రభుత్వంపై ప్రభుత్వ అధికారులపై విశ్వాసాన్ని పెంచవలసిందిగా కోరుచున్నాము. తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులో కేసు గెలిచి ఉంటే 4-1-6 అనే ఇంటి నెంబర్ గల ఇల్లు గోపి కృష్ణదే అయితే అతనికి ఇచ్చేయండి కానీ మా ఇంటి నెంబర్ 4-1-5 అనగా కుంజా వెంకట్ పేరు మీద ఉన్నది మా నాన్నగారిది కావున మా స్థలంలో నిర్మించిన ఎస్ కే టి వారి సాయి విభా జువెలరీస్ షాపింగ్ కాంప్లెక్స్ ను తొలగించి మా స్థలాన్ని మాకు ఇప్పించగలరని  కోరుచున్నాము.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333