మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకే : ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు

జోగులాంబ గద్వాల 4 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల టౌన్ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు అయ్యాక జైలుకు పంపడం జరుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు తెలిపారు.శుక్రవారం సాయంత్రం పట్టణంలోని కొత్త బస్టాండ్ పరిధిలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి బ్రీత్ లైజర్ తో తనకి నిర్వహించారు.వాహనాల పత్రాలను పరిశీలించారు.రాంగ్ రూట్లో ప్రయాణాలు నేరమని , వాహనదారులు రాంగ్ రూట్లో దొరికితే కేసులు నమోదు చేస్తామన్నారు.వాహనాలకు సంబంధించి అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు, వాహనాలు నడిపేటప్పుడు మెల్లగా వెళ్లాలని, అతి వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడిన కుటుంబ పరంగా,ఆర్థికపరంగా నష్టపోతారని అన్నారు.వాహనాలు జాగ్రత్తగా నడిపి గమ్యం చేరుకోవాలని వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్ ఎస్సై వెంట ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.