జిల్లాలో అస్తవ్యస్తమైన  బాలికల విద్య వ్యవస్థ

Jun 16, 2024 - 20:39
Jun 16, 2024 - 21:57
 0  13
జిల్లాలో అస్తవ్యస్తమైన  బాలికల విద్య వ్యవస్థ

 బిజెపి జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి

జోగులాంబ గద్వాల 16 జూన్ 2024 తెలంగాణవార్తా ప్రతినిధి:-  అయిజ. పట్టణ కేంద్రంలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలో కేజీబీవీ ( కస్తూర్బా గాంధీ పాఠశాలలో ) బాలికలకు సీట్లు దొరకక ఇబ్బంది పడటంతో బాలికలకు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరంగా మారిందని జిల్లాలో తగినంత కస్తూర్బా పాఠశాలలో సీట్లు లేకపోవడంతో  బాలికలుసీడ్ పత్తి పనులకు  వెళ్లడం జరుగుతుంది విద్యార్థినిల చదువు కోసం కేంద్ర ప్రభుత్వం బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ద్వారా కోట్ల నిధులను కేటాయించిన  ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టి నిధులను ఉపయోగించు కోకుండా  బాలికలను విద్యకు దూరం చేస్తూ చోద్యం చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండ కట్టారు.

అంతేకాకుండా అరకొరగా ఉన్న కేజీబీవీ పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడం కనీసం విద్యార్తి లకు టాయిలెట్ సౌకర్యం లేకపోవడం ఆట స్థలంలో నీళ్లు నిలవడం పిచ్చి మొక్కలు పెరగడంతో పాఠశాలల్లోకి రాత్రిపూట విష సర్పాలు క్రిమి కీటకాలు రావడం తో పాఠశాలల్లోని బాలికలు ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇట్టి విషయంపై సంబంధిత అధికారులకు  కంప్లైంట్ ఇచ్చిన  పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండడం జిల్లా పరిధిలో అదనంగా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలను పెంచాలని డిమాండ్ చేశారు మండలాల వారిగా బీసీ బాలికల వసతి గృహాల సంఖ్య  పెంచాలని  ఆయన డిమాండ్ చేశారు
తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి శాఖ కు మంత్రి ఉన్నారు కాని విద్యాశాఖకుమాత్రం మంత్రి లేకపోవడం సోచినీయం అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో అర్థం అవుతుందని ఆయన ఎద్దేవా చేశారు.  జిల్లాలో విద్యార్థినిలకు KGBV లో సీట్లు దొరక నందుకు   విద్యార్థినిలు సీడ్ పత్తి కూలీలుగా మారుతున్నారని  జిల్లాలో సీడ్ కాటన్ పత్తి దాదాపు 40 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నడంతో ఎక్కువమంది కూలీలకు వెళ్తూ విద్యకు దూరమవుతున్నారని దుయ్యపట్టారు.

  ఈ కార్యక్రమంలో.... మండల అధ్యక్షులు గోపాల కృష్ణ సీనియర్ నాయకులు  మేడి కొండ భీమ్ సేన్ రావ్ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్ టౌన్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకటేష్ నాయుడు టౌన్ సోషల్ మీడియా చిన్ని కృష్ణ 66 బూతు అధ్యక్షులు గడియా రఘు బోయ మాసుమ్ బోయ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State