రెడ్డి ఎటువైపు...? పార్టీ మారుతున్నాడా...!?
జోగులాంబ గద్వాల 16 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల్:-ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తన నాయకత్వంలో పనిచేసేందుకు సమర్థవంతమైన నాయకుల కోసం సిఎం రేవంత్ రెడ్డి రహస్యంగా సమాచార సేకరణ.ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల మ్మెల్సీ ఎన్నిక గెలుపుతో జోష్ లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి....
ఇది వరకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ముందే సిఎం రేవంత్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే సున్నితంగా తిరస్కరించినట్టు ఉమ్మడి జిల్లాలో గుప్పుమన్నాయి గుసగుసలు.ఆ తర్వాత సిఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఎంపీ స్థానం బిజెపి కైవసం కావడం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గద్వాలలో కాంగ్రెస్ పార్టీకి రెండో స్థానం దక్కడం లాంటి వరుస సంఘటనలతో సిఎం రేవంత్ రెడ్డి మరోసారి బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్టు విశ్వసనీయ సమాచారం.
గద్వాల నియోజకవర్గంలోనీ పలు మండలాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీ మారాలని ఇదివరకే ఎమ్మెల్యేకు వినతులు చేసినట్టు గద్వాల చౌరస్తా లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి పార్టీ మారతారన్న సమాచారం గుప్పుమంటున్నది కానీ పార్టీ మారడం లేదా మరి కొంత కాలం వేచి చూసే దోరణిలో ఉన్నారా అనే విషయం మాత్రం త్వరలోనే తెలియనుంది. ఇదంతా గమనిస్తున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి మాత్రం కార్యకర్తలను నాయకులను కాపాడుకుంటూనే తన రాజకీయ భవిష్యత్ కు దోహదం చేసే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారా...? లేదా..? అనే అంశం మాత్రం ఎమ్మెల్యే స్పందిస్తే తప్ప వీటన్నిటికీ సమాధానం దొరికే అవకాశం ఉండదని గద్వాల నియోజకవర్గ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.