ఉరేసుకొని యువకుడి సూసైడ్
జోగులంబ గద్వాల 15 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్ లో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం. ఇమాంపుర్ గ్రామానికి చెందిన షఫీ (22) తల్లిదండ్రులు గతంలో చనిపోగా, ఇద్దరు అన్నలు ఉన్నారు. కాగా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న షఫీకి ఏమైందో తెలియదు కానీ గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ లు నిర్ధారించారు. ఘటనపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.