నరహంతకు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించండి.........
.హర్యానాలో జరిపిన రైతులపై కాల్పులను నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మ దహనం
రైతులు తాము పండించిన పంటలకు కనీస మతద్దర కావాలని పోరాడుతూ వాళ్ల డిమాండ్ నెరవేర్చకుంటే ఢిల్లీ ముట్టడికి వస్తున్న రైతులపై మోడీ ఆదేశాల మేరకు హర్యానా ప్రభుత్వం కాల్పులు జరిపి ముగ్గురు రైతుల మరణానికి కారణమైంది ఈ దారుణ హత్యాకాండని ఖండిస్తూ సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ ప్రజా పంథా)ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా అంబేద్కర్ బొమ్మ వద్ద మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం నల్ల చట్టాలను రద్దు చేస్తానని రైతులకు హామీ ఇచ్చిన మోడీ ఈరోజు వరకు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తే దానికి నిరసనగా లక్షల మంది రైతులు నల్లచటాలు రద్దుచేసి పండించిన పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని గత కొద్ది రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు చేస్తూంటే రైతులను మోడీ వివిధ రూపాల్లో లాఠీ చార్జీలు చేస్తూ టియర్ గ్యాస్ ఉపయోగిస్తూ రైతులను ఇబ్బందుల గురి చేస్తూ నిన్న ఢిల్లీ ముట్టడికి బయలుదేరిన రైతులపై మోడీ ఆదేశాల మేరకు హర్యానా ప్రభుత్వం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువ రైతులు మరణించారు ఆరుగురు రైతుల పరిస్థితి విషమంగా ఉంది అనేకమంది పరిస్థితి ప్రమాదకరంగా ఉంది దీనికి కారణమైన హర్యాన ప్రభుత్వాన్ని భర్త రఫ్ చేసి మోడీ తక్షణమే తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని డిమాండ్ చేశారు లేనియెడల రైతులకు మద్దతుగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రజలారా మోడీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి భారతదేశంలో కుల మతాలను పెంచి పోషిస్తూ అరాచకత్వానికి కారణం అవుతున్నాడు ప్రశ్నించే ప్రతి వాళ్ళని నిర్బంధాల గురిచేసి అణచివేస్తున్నాడు మైనార్టీలను దళితులను మహిళలకు రక్షణ కల్పించకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తూ నేడు అన్నం పెట్టి రైతులు అని చూడకుండా కాల్పులు జరిపి రైతుల మరణానానికి కారణమైన మోడీ దిగిపోయేదాకా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు దీనికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ పార్టీ జిల్లా నాయకులు మల్లన్న నరసన్న, లక్ష్మన్న ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సయ్యద్, గిఫ్ట్ జిల్లా నాయకులు సయ్యద్ లింగన్న వీరబాబు పిఓడబ్ల్యూ నాయకులు దూరం రేణుక జయ అక్క సత్య అక్క మరి అక్క పావని పి వై ఎల్ నాయకులు కరుణాకర్ పరుశురాం శ్రీకాంత్