అంగన్వాడీలో పోషణ మాసం లో అన్నప్రాసన వేడుకలు

Sep 24, 2025 - 19:19
 0  6
అంగన్వాడీలో పోషణ మాసం లో అన్నప్రాసన వేడుకలు

 చిన్నంబావి మండలం24 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త :  చిన్నంబావి  మండలంలోని కొప్పునూర్ గ్రామ పంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం రోజున “పోషణ మాసం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం సందర్భంగా పలు ఈ కార్యక్రమాలు అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా పెబ్బేర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ.ఏ ఝాన్సి  హాజరయ్యారు ఈ సందర్భంగా సిడిపిఓ ఏ ఝాన్సి మాట్లాడుతూ… పోషకాహార లోపం “సమాజ అభివృద్ధికి” అడ్డంకిగా మారకూడదన్నారు. ప్రతి అంగన్వాడి టీచర్ తన పరిధిలో ఉన్న బాలింతలు,గర్భిణీ స్త్రీలు ,చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయాలని తెలిపారు. ఆకుకూరలు ,పప్పులు, గుడ్లు, పాలు వంటివి తీసుకోవడం ద్వారా లభించే ప్రోటీన్స్, విటమిన్స్ ,మినరల్స్ మన శరీర రక్షణకు ముఖ్యమైనవని అన్నారు .వీటి గురించి సమాజంలో అవగాహన పెంచి పోషణ లోపం లేని సమాజం నిర్మించడానికి అందరం కృషి చేయాలని తెలియచేశారు.పోషకారం, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, చిన్న పిల్లల తల్లులుతో ప్రతిజ్ఞ చేయించారు.ప్రీస్కూల్ పిల్లల శాతాన్ని పెంచాలని అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు. అనంతరం అంగన్ వాడి కేంద్రంలలో సంబరాలు నిర్వహించారు.పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టిన అంగన్వాడీ సిబ్బంది, అన్న ప్రసన్న అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చిన్నారులకు పోషకాహారంతో కూడిన ప్రత్యేక ఆహారాలను అందించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఎండి ఖాజా భాను, ఏ మణెమ్మ లింకపల్లి మన్నెమ్మ  ఆయలు, లక్ష్మి  ఎ ఎన్ యం, ఆశ వర్కర్స్,గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333