ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి..... గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్

Jul 12, 2024 - 16:48
Jul 12, 2024 - 18:05
 0  1
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి..... గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్

మునగాల 12 జూలై 2024  తెలంగాణ వార్తా ప్రతినిధి :- ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.విద్యాలయాలను వ్యాపారం మారుస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసు కుంటామని అధికారులు చెబుతున్నారు. అధికారులు మాత్రం ప్రైవేట్ పాఠశాలలో తనిఖీలు మాత్రం చేపట్టడం లేదు. ఒకవేళ తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ తమ పిల్లలను పాఠశాలల వారు ఇబ్బందులు పడతారని చెప్పకుండా గమ్మున ఉంటున్నారు.సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 250 ప్రైవేట్ పాఠశాలలు ఉంటే ఒక కోదాడ పట్టణంలో సుమారు 70 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. కోదాడలో ఏ గల్లికి వెళ్లిన ప్రైవేట్ పాఠశాల కనిపిస్తుంది. పుస్తకాలను పాఠశాలలో విక్రయించకూడదని నిబంధనలు ఉన్న ప్పటికీ, పాఠశాలలో కాకుండా ప్రత్యేకంగా అద్దెకు గదులు తీసుకొని పుస్తకాలు విక్రయిస్తూ కొత్త దందాకు తెర తీ శారు. అర్హత కలిగిన జర్నలిస్టు పిల్లలకు సైతం ఫీజులో రాయితీ కల్పించడంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విముఖత చూపిస్తున్నాయి. యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజుల విషయంలో ఈ కమిటీ నిర్ణయం తీసుకోవాలి. అలాంటిది ఏ ఒక్క పాఠశాలలో అమలు కావడం లేదు.అని కోదాడ నియోజకవర్గం బీసీ యువజన నాయకుడు గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో సూరగాని రాంబాబు, నరేష్, సతీష్,గోపి,, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు,

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State