మామిండ్లమడవ గ్రామంలో విద్యుత్ షాక్ తో పాడి గేదే మృతి

ముద్దిరాల 12 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పరిధిలోని మామిండ్లమడవ గ్రామంలో లింగయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో గేదె మేత మేస్తూ అక్కడ ఉన్న వాగు దాటుతుండగా తెగిపోయిన విద్యుత్ వైర్ తగిలి గేదె మృతి చెందినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గేదె సుమారు విలువ 60 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.అక్కడక్కడ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కిందికి వైర్లు ఉండడంతో నోరు లేని జీవాలే కాకుండా ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వెంటనే ఎక్కడైతే అలాంటి వైర్లు ఉన్న విద్యుత్ అధికారులు చోరువు తీసుకుని అలాంటి సంఘటన జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాధిత రైతు కుటుంబం గేదె మృతి చెందడం పట్ల కన్నీటీ శ్లోకం తిశారు.ప్రభుత్వం విచారణ చేసి బాధిత రైతును ఆదుకోవాలని సగటు రైతులు, గ్రామస్తులు న్యాయం చేయాలన్నారు.