జడ్పీ చైర్ పర్సన్ లోకనాథ్ రెడ్డి రాకతో చిన్నంబావి కస్తూరబ్బు పాఠశాలలో జలకళ

04-04-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:- చిన్నంబావి మండల కస్తూరిబా బాలికల పాఠశాలను సందర్శించిన వనపర్తి జిల్లా జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని బాలికల కస్తూర్బా పాఠశాలలో గత మూడు రోజుల నుండి నీళ్ల సదుపాయము లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం చిన్నంబావి మండల కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపల్ స్థానిక జడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రామమ్మకు తెలియజేయగా తక్షణమే జడ్పీ చైర్మన్ గారి దృష్టికి మరియు మిషన్ భగీరథ అధికారులకు కస్తూర్బా పాఠశాలలో 200 మంది విద్యార్థులు నీటి సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలియజేయగా తక్షణమే పరిష్కరించాలని జడ్పీ చైర్మన్ జిల్లా అధికారులకు ఆదేశించగా సంబంధిత అధికారులు యుద్య ప్రతిపాదికగా చర్యలు తీసుకొని సమస్య పరిష్కారం చేసి భగీరథ వాటర్ ను చిన్నంబావి మండల కస్తూర్బా పాఠశాలకు ఇవ్వడం జరిగినది. స్థానిక జడ్పిటిసి గారితో పాటు వనపర్తి జిల్లా జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. కస్తూర్బా పాఠశాలను సందర్శించి విద్యార్థునీయులతో చర్చించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఇకనుండి నీటి సమస్య రానివ్వకుండా అధికారులను ఆదేశించడం జరిగినది. విద్యార్థినీలు చక్కగా చదువుకొని ప్రతి ఒక్కరు పోటీ తత్వంతో మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మండలానికి జిల్లాకి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని జడ్పీ చైర్మన్ విద్యార్థులకు ఉపదేశించారు.