తొలగించిన విద్యుత్తు ని పునరుద్ధరించి లిఫ్టుల ద్వారా చెరువుల నింపాలి...
మేదరమెట్ల వెంకటేశ్వర్లు

మునగాల 04 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- నిర్బంధంగా లిఫ్ట్ ఇరిగేషన్ విద్యుత్తును తొలగించి తూముల దగ్గర పోలీసు బలగాలు ఉపయోగించి బలవంతంగా పాలేరుకు నీరు తరలించడం అన్యాయమని తొలగించిన విద్యుత్తును పునర్ధరించి తక్షణమే లిఫ్టుల ద్వారా ద చెరువులు కుంటలు నింపాలని జయభారత్ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు గురువారం స్థానిక కొక్కిరేణి విజయభారత ఎల్ 30 31 లిఫ్ట్ ఇరిగేషన్ సమావేశంలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్పి అధికారులు ఏకపక్షంగా పాలేరుకు నీరు తరలించడం సరైన కాదని అన్నారు భూగర్భ జలాలు అడుగంటి గ్రామాల్లో మంచి నీటి కొరత తీవ్రంగా ఉందని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన లిఫ్టుల ద్వారా చెరువులు.కుంటలు నింపి ప్రజల దాహత్తిని తీర్చాలని వారు కోరారు ఈ యొక్క సమావేశంలో లిఫ్ట్ ఇరిగేషన్ మాజీ చైర్మన్ పోటు లక్ష్మయ్య వ్యవసాయం సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు నందిగామ సైదులు కామల్ల నవీన్ ఎల్లావుల సైదులు శ్రీకాంత్ యానాల సోమయ్య కొట్టెపు సైదులు తదితరులు పాల్గొన్నారు.