జగ్గయ్యపేట ను స్వచ్ఛ జగ్గయ్యపేట గా మారుస్తాం ఎమ్మెల్యే శ్రీ శ్రీ రామ్ రాజగోపాల్ తాతయ్య గారు

Nov 8, 2024 - 10:15
Nov 8, 2024 - 18:24
 0  11
జగ్గయ్యపేట ను స్వచ్ఛ జగ్గయ్యపేట గా మారుస్తాం ఎమ్మెల్యే శ్రీ శ్రీ రామ్ రాజగోపాల్ తాతయ్య గారు

ఏపీ తెలంగాణ ప్రతినిధి :- జగ్గయ్యపేట ను స్వచ్చ జగ్గయ్యపేట గా మారుస్తాం..ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.

జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక ఊర చెరువును మరియు పరిసర ప్రాంతాలను శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ఈరోజు ఉదయం పరిశీలించడం జరిగింది 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊర చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తామని చుట్టుపక్క పరిసర ప్రాంతాలన్నీ చెత్త లేకుండా చెరువులు సైతం అభివృద్ధి పరుస్తామని చెరువులో పేరుకుపోయిన తూటాను ఇప్పటికే తీసివేసేందుకు కృషి చేస్తున్నామని అకాల వర్షాల వల్ల చెరువు చుట్టుపక్కల మొత్తం గడ్డి పెరిగిపోయి వాకింగ్ ట్రాక్ పై నడిచేందుకు వీలు లేకుండా ఉందని వారం రోజుల్లో పూర్తిస్థాయిలో వాకింగ్ ట్రాక్ను పునరుద్ధరిస్తామని తెలియజేశారు అలాగే పూల చెరువు చుట్టుపక్కల ఉన్నవారు ఎవరు కూడా ఇంటిలో చెత్తను చెరువు పరిసర ప్రాంతాలు విసిరేయకుండా మున్సిపాలిటీ వారి ఆటోలో వేయాలని కొంతమంది ఆకతాయిలు రాత్రి సమయంలో ఇక్కడ మద్యం సేవిస్తున్నారని ప్రజలు తెలియజేశారని ఇప్పటికే స్థానిక పోలీసువారికి తెలియజేయడమైనదని ఈరోజు నుంచి రోజు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని ఎస్సై గారు తెలియజేయడమైనదని అన్నారు. నిరుపయోగంగా పడి ఉన్న బీసీ కమ్యూనిటీ భవనంను త్వరలోనే ఆక్షన్ ద్వారా ఎవరికో ఒకరికి శుభకార్యాల నిమిత్తం కేటాయిస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రంగాపురం రాఘవేంద్రరావు, కమిషనర్ రామ్మోహన్, కన్నెబోయిన రామలక్ష్మి, గింజుపల్లి వెంకట్రావు, సూర్యదేవర రాంప్రసాద్, సామినేని మనోహర్, గొట్టే నాగరాజు, వేదులాపురి సైద, కర్ల జోజి, పూసల పుల్లారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంబాబు, షేక్ మాబ్మియా ,గాలం శ్రీను, షేక్ అక్బర్, పితాని శ్రీనాథ్, కావేటి కోటి, మార్తి అచ్చయ్య, సర్వేపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State