ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆత్మకూరు ఎస్... 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయంలో సోమవారం జాతీయ జెండాలు ఆవిష్కరించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో తాహసిల్దార్ అమీన్ సింగ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో హసీo, వ్యవసాయ కార్యాలయంలో ఏవో దివ్య, ప్రభుత్వ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి లు జెండా ఆవిష్కరించారు. దుబ్బ తండాలో గ్రామపంచాయతీకి స్థలాన్ని విరాళం ఇచ్చిన సర్పంచ్ జాటో లక్ష్మి దంపతులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. పెనుమాముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రజా రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులు వట్టే జానయ్య యాదవ్ ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ఈశ్వర్, ఏపీఎం రాము, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.