గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
తిరుమలగిరి 02 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
గ్రామ పంచాయితీ ఎన్నికలని పకడ్బందీగా నిర్వహించాలని , ఇందుకోసం నియమావళిని అవగాహన చేసుకుని ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో లాజర్ తెలిపినారు. తిరుమలగిరి మండలం మోడల్ స్కూల్ ఆనంతారం నందు ప్రిసైడింగ్ అధికారుల శిక్షణా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరిప్రసాద్ , మాస్టర్ ట్రైనర్లు అశోక్ రెడ్డి , సైదులు , సత్యనారాయణ రెడ్డి మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.