నవంబర్ 23న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం చేయండి
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్:- నవంబర్ 23న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం చేయండి*.. *సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి ములకలపల్లి రవి మాదిగ* ఈనెల 23న ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలోని మాదిగల ఆత్మీయ సమ్మేళనం సభ జరగబోతున్నందున ఈ మాదిగల ఆత్మీయ సమ్మేళన సభకి వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయవల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డ మీద మాదిగ జాతి మీద ఉన్నదని విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించ వలసిన విషయమని అన్నారు. ఉమ్మడినల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్రం నుండి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ప్రొఫెసర్ కాసిం,ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఏఐసీసీ నెంబర్ సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిదులు మేధావులు కవులు గాయకులు కళాకారులు వస్తున్నందువలన వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు మండల పరిధిలో అన్నిలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ అన్ని అనుబంధ సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మేడి కృష్ణ మాదిగ ములకలపల్లి ఎల్లయ్య, పోలే పరుశరాములు, పగడాల పరమేష్, బొడ్డు అయోధ్య, మారేపల్లి శ్రీను, ములకలపల్లి వీరస్వామి, బొడ్డు సైదులు,