గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు, ఐపీఎస్
జోగులాంబ గద్వాల 1 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు ఐపీఎస్ మంగళవారం గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికoగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డ్ లను మరియు సిబ్బంది నిర్వహిస్తున్న విదులను పరిశీలించారు. వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారునితో సిబ్బంది గౌరవంగా మెలగాలని, వచ్చినా ఫిర్యాదు పై తక్షణమే విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్సై కి సూచించారు. నిత్యం ప్రజలతో లైసనింగ్ మెయింటేన్ చేస్తూ నేరాలకు సంబంధించిన ముందస్తు సమాచారం సేకరించాలని అన్నారు. సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో గస్తీ బీట్ సిబ్బందిని పెంచి పట్టణం లో ఎలాంటి నేరాలు జరగకుండా నిఘా పెంచాలని, పగలు వేళల్లో తిరిగే బ్లూ కోల్ట్స్ సిబ్బంది అలర్ట్ గా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆయా కేసులలో పట్టుబడ్డ వాహనాలు కోర్టు అనుమతి తీసుకొని డిస్పోజల్ చెయ్యాలని ఎస్సై కళ్యాణ్ కుమార్ ను ఆదేశించారు.
ఎస్పి వెంట డి.ఎస్పి వై మోగిలయ్య , సిఐ టి. శ్రీను ఉన్నారు...