మహబూబ్ నగర్ పట్టణం, ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహము
ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నత లక్ష్యం నిర్ణయించుకొని అందుకు అనుగుణంగా మంచిగా చదువుకొని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ఆకాంక్షించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు . ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. హాస్టల్లో గ్రంథాలయం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా కొత్త సంవత్సరం ప్రారంభించుకుందామని, ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, బుద్దారం సుధాకర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్,పుల్జాల రవి వార్డెన్ స్వప్న రాణి, యూనియన్ సభ్యులు క్రిష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు