ఇది ఇందిరమ్మ రాజ్యమా..కబ్జాదారుల రాజ్యమా..!
సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని లాక్కొనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి కురువ పుల్లయ్య.
జోగులాంబ గద్వాల 1 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పీజీ కేంద్రంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులతో కలిసి నిరసన తెలుపడం జరిగింది .
ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ...
* హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు వేలం వెయ్యడన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ కీ వ్యతిరేకంగా నిరసన.
* ప్రపంచ ప్రఖ్యాత కలిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయడాన్ని వెంటనే రద్దు చెయ్యాలి విశ్వవిద్యాలయాల భూముల జోలికి వస్తే భారత రాష్ట్ర సమితి విద్యార్థి నాయకులుగా చూస్తూ ఊరుకోమని ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని రోడ్లమీద తిరగనియ్యమని హెచ్చరించడం జరిగింది.
* మొదటినుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని విద్యా విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఇందిరమ్మ రాజ్యం అంటే విశ్వవిద్యాలయాల భూములు అమ్మడమేనా అనేది ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాలి. నాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 1970 లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీని గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారు.
* ఇలాంటి భూములను బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టడం కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నాడు ఇకముందు ఇలాంటివి కొనసాగనివ్వమని హెచ్చరిస్తున్నాం.
* నిజంగా విద్యార్థుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించేవిధంగా పనిచేయాలి కానీ కోర్టు సెలవులను చూసి బుల్డోజర్లతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి చొరబడిన వారిని ఇది ఏమిటి అని అడిగిన విద్యార్థులపై నిర్ధాక్షణంగా దాడులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
* విద్యార్థులపై నాన్ బేలేబుల్ కేసులు పెట్టరు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అరెస్ట్ అయిన విద్యార్థుల ను వెంటనే విడుదల చేసి హెచ్ సి యూ భూముల వేలాన్ని నిలిపి వేస్తున్నామని వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
* రాష్ట్రంలో యూనివర్సిటీలకు సరైన బడ్జెట్ కేటాయించకుండా మరియు యూనివర్సిటీ లోని 1000 కీ పైగా ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా విద్యపై పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అంద:పాతాలానికి తొక్కుతున్న రేవంత్ రెడ్డి సర్కార్.
* హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీ మీద కనీస అవగాహన లేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజలతోపాటు విద్యార్థుల పాలిట శాపంగా మారింది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోలేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు రాజశేఖర్, మాధవ్, మహేష్, ప్రకాష్, పవన్, రాజు, బలిచక్రవర్తి, ధనరాజ్, అభి, నరేంద్ర, బాలు తదితరులు పాల్గొన్నారు.