గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పై జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప
జిల్లా గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు
జోగులాంబ గద్వాల 18 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల నిన్నటి దినం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా పాల దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తమ ముఖ్య అనుచరులను మాత్రమే స్టేజిపై ఆహ్వానించి కూర్చోబెట్టడం... మిగిలిన అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డెప్పను ,జిల్లా గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులను కూర్చోబెట్టకపోవడంతో ప్రోటోకాల్ రగడ మొదలైంది.
ఈ క్రమంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దురుసు ప్రవర్తనతో దొడ్డప్ప, శ్రీనివాసులను అసభ్య పదజాలంతో మాట్లాడి అలంపూర్ ప్రజల మనోభావాలను దెబ్బతీయడంతో ఈరోజు అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు తమ కార్యకర్తలతో కలిసి ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కి మరియు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలియజేశారు.
ఈ ఫిర్యాదు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమానికి అలంపూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.