ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
సూర్యాపేట టౌన్ :- సూర్యాపేట పట్టణంలోని ఎం ఏ ఎం హైస్కూల్లో 2003 2004 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు అనంతరం వారికి విద్య నేర్పిన గురువులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అలనాటి గురువులు,ప్రకాష్ మధుసూదన్,జగదాంబ, వెంకటేశ్వర్లు,దాదేష్, సరళ, ప్రేమ్ కుమార్,పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ అలనాటి విద్యార్థుల మధురస్మతులను గుర్తు చేసుకుంటూ మంచి సత్ప్రవర్తనతో క్రమశిక్షణ విధానంలో మంచి విద్యార్థులుగా కలిగి ఉన్నారని వారు గుర్తు చేశారు వారి వారి వృత్తులలో రాణించాలని మీ పిల్లలు కూడా క్రమశిక్షణ బుద్ధులు నేర్పించాలని వారిని కూడా మీలాగే మంచి ఉన్నతమైన విద్యార్థులుగా పెంచి పోషించాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు దైద ఈశ్వర్, నాగరాజు, శ్రీకాంత్,మహేందర్, గోపి, మధుబాబు, వెంకటాచారి, ఆరే నాగరాజు, రమణ,అరుణ, రేణుక, సుమతి, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.