గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఆన్లైన్ అనుమతులు తప్పనిసరి..... ఎస్సై ప్రవీణ్ కుమార్
మునగాల 20 ఆగస్టు 2025
తెలంగాణ వార్త ప్రతినిధి :-
గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించిన policeportal.tspolice.gov.in పోర్టల్ లో మునగాల మండల వ్యాప్తంగా ఉన్న ఉత్సవ కమిటీలు దరఖాస్తు చేసుకోవాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గణేష్ మండప నిర్వాహకులు ఆన్లైన్లో అనుమతి ప్రక్రియ తొందరగా పూర్తి చేసుకోవాలని,ప్రమాదాలు జరగకుండా విద్యుత్తు ఇతర జాగ్రత్తలు తీసుకోని నిమజ్జనం అయ్యే వరకు మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా ఉండాలని మండపాల వద్ద పెట్టే సౌండ్ సిస్టం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు.నిమజ్జనం సమయంలో ఎక్కడ కూడా డీజేలు పెట్టొద్దని చెప్పారు.పండగను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్ కి సమాచారం ఇవ్వాలని సూచించారు.