తాడువాయి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతను మెరుగుపరచడానికి 50 వేల రూపాయలు తక్షణ సహాయం అందించిన జిల్లా కలెక్టర్.... తేజస్ నంద్ లాల్ పవార్
మునగాల 20 ఆగస్టు 2025
తెలంగాణ వార్త ప్రతినిధి :హ
పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత లకు ప్రాధాన్యతా ఇచ్చినప్పుడే వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం మునగాల మండలం, తాడ్వాయి గ్రామం లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్బంగా కలెక్టర్ గ్రామంలో వీధులను,మురికి కాలువలు, ఇంటి ముందు ఇంకుడు గుంట లేకుండా వాడుకున్న నీరు రోడ్లపై ప్రవహించటం, కలియ తిరిగి పరిశీలించారు.జ్వరంతో ఇబ్బంది పడి తగ్గిన వ్యక్తి తో ఆరోగ్యం ఎలా ఉంది? ఏ హాస్పిటల్ లో చూపించుకున్నావు? అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక పోవటం, పరిసరాల పరిశుభ్రత లోపించడం, కొన్ని చోట్ల చెత్తను ప్రజలు ఖాళీ ప్రదేశాలలో వేయటం, జన ఆవాసాల మధ్య పిచ్చి మొక్కలు గుబురుగా ఉండటం గమనించిన జిల్లా కలెక్టర్ ప్రతి ఇంటికి ఇంకుడు గుంట నిర్మించాలని, వాడుకున్న వృధా జలాలు ఇంకుడు గుంటలోకి మళ్లీస్తే ఇండ్ల ముందు నీరు నిల్వ లేకుండా ఉంటుందని చెప్పారు. ఎక్కువ మంది గ్రామ పంచాయతీ సిబ్బంది ని ఉపయోగించుకొని ప్రతి బజారు లో జేసిబి ల ద్వారా పిచ్చి మొక్కలను తొలగించాలని, ప్రతి బజారు లో డెమోపాస్ స్ప్రే, బ్లీచింగ్ వెదజల్లాలని, ఫాగింగ్ చేయాలని ఎంపిడిఓ ను ఆదేశించి తక్షణ సహాయం కొరకు 50,000 రూపాయల చెక్ ని అందజేశారు. మనుషులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధులు రావని ప్రజలు ,ఈ విషయంలో భాద్యతగా ప్రజలు అధికారులకు సహకరించాలని, తాజా ఆహరం తీసుకోవాలని, కాచిచల్లార్చి వడపోసిన నీరు త్రాగాలని ఇలా చేయటం ద్వారా సీజనల్ వ్యాధులు అరికట్టవచ్చని సూచించారు. తాడ్వాయి గ్రామం లో నిర్వహిస్తున్న జ్వర సర్వే పై డాక్టర్లను అడగగా జూలై నుండి ఇప్పటివరకు 6 వ విడత సర్వే నడుస్తుందని, 93 మంది జ్వరం కేసులు నమోదు అయ్యాయని, వాటిలో 5 డెంగ్యూ కేసులు నమోదు అవ్వగా, ప్రస్తుతం 2 ఆక్టివ్ గా ఉన్నారని కలెక్టర్ కు వివరించారు. ఎ యన్ ఎం లను, ఆశా వర్కర్లను తమ పరిధిలో బాలింత లు ఎంతమంది ఉన్నారు? గర్భిణీలు ఎంతమంది ఉన్నారు ?హై రిస్క్ కేసులు ఎన్ని ఉన్నాయి ? గత నెలలో ఎంతమంది ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరి అవుతున్నారని? అడిగి తెలుసుకున్నారు. ఆదూరి సురేష్ కి చెందిన ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు. అలాగే కోట లక్ష్మి పూరి గుడిసె ఇంటిని పరిశీలించి అర్హత ఉంటే వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని,కష్టాల లక్ష్మి,లోడంగి నాగ సైదమ్మ లు మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలనికలెక్టర్ కి విన్నపించుకున్నారు. అర్హత ఉంటే పరిశీలించి ఇవ్వాలని ఎంపిడిఓ ను ఆదేశించారు. తహసీల్దార్ చంద్రశేఖర్,ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్, వైద్యులు శ్రీశైలం, వినయ్, వైష్ణవి, పంచాయతీ కార్యదర్శి రాము, ఎ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.