హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలి కుదిలైంది

ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నిర్మించాలి.
భూభారతిలో మార్పులు తేవాలి.
ఎల్ ఆర్ ఎస్ నిబంధనలను సవరించాలి.
రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.
(సూర్యాపేట టౌన్, జూన్ 28) : ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయంతోనే రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలి కుదేలయ్యింది. అని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శని వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన కార్యాలయం నుండి విలేకరులతో మాట్లాడారు. హైడ్రా వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతిలో కూడా స్వల్ప మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు కేసులో ఉన్న భూముల విషయంలో అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కోర్టు పరిధిలో ఉన్న వివాదాల భూములకు పాస్ పుస్తకాలు జారీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కరణ కింద అధికారులకు ఇబ్బందులు తప్పవని తెలిపారు. ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ గడువు పెంచి నాలా కన్వర్షన్ మీద ఎకరంలోపు భూములకు రిజిస్ట్రేషన్లు చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వo తీసుకున్న హైడ్రా నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని,రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడ్డ ఎంతోమంది జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయని వాపోయారు. ఎఫ్ టి ఎల్ పరిధిని 200 మీటర్లు కాకుండా కేవలం 30 మీటర్ల వరకే తగ్గించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్ ఆర్ ఎస్ కొరకు మీసేవ ద్వారా ఇండ్ల ఫ్లాట్లకు 10000 రూపాయలు కట్టించుకున్న ప్రభుత్వం ఇంతవరకు దాని రెగ్యులరైజేషన్ అమలు చేయలేదు అన్నారు. దాన్ని పెండింగ్ లేకుండా ఎల్ఆర్ఎస్ రెగ్యులర్ చేసేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 142 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొన్ని మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయని లేనిచోట ప్రభుత్వం నూతన భవనాలు నిర్మించి రిజిస్ట్రేషన్ కార్యాలయం పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. కార్యాలయాలలో కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు సిబ్బందిని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటి అంజయ్య గౌడ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, రాపర్తి జానయ్య, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, తదితరులు పాల్గొన్నారు.