గంటల వ్యవధిలోని కేసు చేదించిన గద్వాల పోలీసులు

Jun 7, 2025 - 19:21
 0  5
గంటల వ్యవధిలోని కేసు చేదించిన గద్వాల పోలీసులు

గద్వాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పార్కింగ్ చేసిన లారీని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు అయితే బాధితుడు సాదిక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఎస్సై కళ్యాన్ కుమార్ విచారణ చేపట్టారు. అయితే ఎత్తుకెళ్లిన లారీని సాంకేతిక విభాగ సిబ్బంది ఆధ్వర్యంలో పరిశీలించారు. అయితే వనపర్తి పెబ్బేర్ బిజినపల్లి నాగర్ కర్నూల్ బాల్నగర్ మీదుగా లారీ వెళ్తున్నట్లు గుర్తించారు. దాదాపు 8 గంటల వ్యవధిలోనే బాల్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద లారీని గుర్తించారు. దీంతో లారీని పోలీసులు స్వాధీనం చేసుకొని గద్వాల స్టేషన్ కు తరలించారు లారీ విలువ 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు కేసు చేదనలో సాంకేత విభాగ సిబ్బంది చంద్రయ్య, కిరణ్, రాజు యాదవ్ లు కృషి అభినందనీయ మన్నారు. స్వాధీనం చేసుకున్న లారీని బాధితులకు ఇవ్వనున్నట్లు ఎస్సై తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333