జగ్గయ్యపేటలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి ఉర్సు మహోత్సవం ఆహ్వానం
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి :- జగ్గయ్యపేటలో శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారికి ఉరుసు మహోత్సవ ఆహ్వానం జగ్గయ్యపేట నియోజవర్గ శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారికి కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428 వ ఉరుసు మహోత్సవాలకు హాజరవ్వాలని ఆయనకు ఆహ్వానం అందజేశారు. కమిటీ సభ్యులు. పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428 వ ఉరుసు మహోత్సవాలు జనవరి 9,10,11 తేదీలలో జరగనున్నాయి. ఈ ఉరుసు మహోత్సవాలకు అతిథిగా రావాల్సిందిగా కమిటీ సభ్యులు శ్రీరాం తాతయ్య గారికి ఆహ్వానం అందించారు.ఈ కార్యక్రమంలో ఉరుసు కమిటీ సభ్యులు ఎస్ఎం పైజాన్, మహమ్మద్ అప్సర్, షేక్ మహబూబ్ సుభాని, షేక్ సమీవుల్లా, షేక్ అమనుల్లా, భాష, షమ్స్ తబరేజ్, షేక్ ఇబ్రహీం, షేక్ జిలాని, కత్తి రాజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.