కోదాడ ఆర్డిఓ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ ధర్నా.
రైతులను మోసం చేసిన కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ హామీలు నిలబెట్టుకోవాలి.
భవిష్యత్తులో ఆందోళనలు తప్పవు.
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
ఆగస్టు 22: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ,ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు.బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు గురువారం కోదాడ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా నిర్వహించామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని వారు సూచించారు. లేకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో కాంగ్రెస్ పార్టీ మాటల పార్టీయే కానీ చేతల పార్టీ కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, తోగరు రమేష్, నల్ల భూపాల్ రెడ్డి, గట్ల కోటేశ్వరరావు, చిమ్మిరియాల రమేష్, నయీమ్, అబీదర్ నాయుడు, మాదాల ఉపేందర్, కర్ల సుందర్ బాబు, మామిడి రామారావు , పొట్ట కిరణ్, కాసాని మల్లయ్య, చలిగంటి వెంకట్, తాళ్లూరు అన్ శ్రీను ,చారి ,అంబాల రాంబాబు, పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు