నాడు పశువుల కాపరి, నేడు పిహెచ్డి హోల్డర్
గ్రామానికి ఆదర్శంగా నిలిచినా పేద విద్యార్థి
సూర్యాపేట : ఆగస్టు 22, ఆర్టీఐ నిఘా న్యూస్ :
సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయ రాఘవపురం (రామసముద్రం) అనే మారుమూల గ్రామంలో నిరు పేద కుటుంబం జన్మించి,, చిన్నతనంలో చదువు విలువ తెలియక, తమ కుటుంబంలో ఉన్న పశువులను పది సంవత్సరాల వరకు కాపరిగా ప్రయాణం కొనసాగించి తన కుటుంబంలోని పెద్దన్నై ద్వారా తన పాఠశాలలో నేరుగా మూడవ తరగతి లోకి అడుగుపెట్టడం జరిగింది, ఆ రోజు నుండి నేటి వరకు పిహెచ్డి పట్టా పొందే వరకు వెనుతిరగకుండా ప్రయాణం కొనసాగించినాడు, చదువుకునే సమయంలోనే ఉద్యమాలు పాల్గొంటు ,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనం ఏ సమాజం నుంచి అయితే వచ్చిన ఆ సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని భావనతో, సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ, ఇటు చదువులు కొనసాగిస్తూ, ఇటు జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ, మన జీవితాలను మార్చే ఆయుధం చదువు ఒక్క టే అనే స్ఫూర్తితో దేశంలోనే అత్యంత అయినటువంటి చదువు అయినా పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగింది. అదే సమయంలోనే బి కే పెంటయ్య హాస్టల్లో చేరి విద్యకు ఉండేటటువంటి విలువలను గౌరవాన్ని తెలుసుకొని తన విద్యా ప్రస్థానాన్ని కష్టమైన కానీ కొనసాగిస్తూనే , తను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే వివాహం చేసుకొని వెంటనే పిల్లలు వైవాహిక జీవితాన్ని గడుపుతూ కొన్ని సంవత్సరాల పాటు ప్రైవేటు టీచర్గా పని చేసి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆగిపోయిన తన విద్యను మళ్లీ కొనసాగించి ఎంతో కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థిగా కొనసాగుతూ కొన్ని సదుపాయాలు లేకున్నా ,..విద్య అందుకోలేని సామాజిక వర్గం అని ముద్ర వేయబడిన కులం నుంచి నేడు అత్యున్నత స్థాయి పీహెచ్డీ పూర్తి చేసి నేడు ఉస్మానియా యూనివర్సిటీ జాగ్రఫీ శాఖ నుంచి ప్రొఫెసర్ లక్ష్మయ్య సార్ గైడెన్స్ లో( అప్లికేషన్ ఆఫ్ జి ఐ ఎస్ అర్బన్ ల్యాండ్ యూజ్ చేంజెస్ ఇన్ సూర్యాపేట మున్సిపల్ ఏరియా నల్గొండ డిస్ట్రిక్ట్ తెలంగాణ ఇండియా)
డాక్టరేట్ పట్టాను కత్తి వీరన్న అందుకోవడం జరిగింది. ఈ సమయంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.