కోట్లు గడించాలంటే... నేలకొండపల్లి నే అడ్డా

Aug 30, 2024 - 18:05
 0  68
కోట్లు గడించాలంటే... నేలకొండపల్లి నే అడ్డా

కోట్ల రూపాయల ఎగవేతకు కేంద్రంగా మారిననేలకొండపల్లి...?
*రియల్ ఎస్టేట్ మాయజాలానికి రెండు కళ్ళు కూడా చాలవా....?
*ప్రజా ప్రతినిధి ముసుగులో డబల్ బెడ్ రూమ్ ఏరియా డొంకలో పాగా...?
దర్జాగా రిజిస్ట్రేషన్.. అక్రమానికి అడ్డుపద్దు లేదా..?
ఎటువంటి అనుమతులు లేని ప్లాట్లు కొని ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించలేక "సత మతం"....?
వ్యాపారం నిర్వహించారు...కోట్లు గడించారు...?
*లావాదేవీలలో రెండు కోట్ల మేర నష్టపోయినట్లు బిల్డప్ ఇస్తున్న ఓ ప్రజా ప్రతినిధి...?
*అంతా తెలిసే చేశారా...? నేలకొండపల్లి రియల్ ఎస్టేట్లో అందరిదీ అదే దారి...?
*బఫర్ జోన్లు పంట కాలువలు ఎన్ఎస్పి స్థలాలు దేవుడు మాన్యాలు కనుమరుగు.  ?
అసైన్మెంట్ భూమిని సైతం వదలని వెంచర్ నిర్వాహకులు...?
వ్యాపారులు ...అధికారులు చెట్టా పట్టాల్...?
నేలకొండపల్లి వెంచర్లలో కంటికి కనిపించని గ్రీన్ బెల్ట్ లు పంట కాలువలు...?
మూడు వైపులా దారి లేదు... కానీ 30 పైగా ప్లాట్లు అమ్మకాలు..?
*ఎన్ఎస్పి స్థలాలను సైతం వదలని భూ బకాసురుడు...?
మండల కేంద్రంలో ఆర్ అండ్ బి స్థలాన్ని సైతం కబ్జా చేసిన ఓ ప్రజా ప్రతినిధి...?
అర్థ బలం అంగ బలం అధికార బలం శ్రీరామరక్షగా వర్ధిల్లుతున్న నేలకొండపల్లి...?
ఇంతకీ అక్రమాలను తొలగిస్తారా...? కోట్ల రూపాయల అవినీతి పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయా...?
*నేలకొండపల్లి రియల్ ఎస్టేట్ మాయాజాలంపై వెల్లువెత్తుతున్న విమర్శలు...?
తెలంగాణ వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఆగస్టు 30 :- ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి కేంద్రంగా  వెంచర్ల నిర్వహకులు కోట్ల రూపాయలు గడిస్తూ ప్రభుత్వ అనుమతులు లేకుండా దర్జాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మూడు పూలు ఆరు కాయలుగా నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రంలో కొందరురాజకీయ నాయకులుగా చలామణి అవుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి అధికారుల అండదండలు కాసులను ఎరగా వేసి ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్ల నిర్మాణం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గాని పట్టించుకున్న నాధులు కరువయ్యారని మండల కేంద్రం ప్రజలు ఆరోపిస్తున్నారు. అవినీతికి అలవాటు పడిన అధికారులు ప్రభుత్వ సంపదలను ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి భక్షించారనే ఆరోపణలుసైతంవినిపిస్తున్నాయి. మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఓ ప్రజా ప్రతినిధి వ్యాపారం భాగస్వామ్యం వలన సుమారు రెండు కోట్లు నష్టం వాటిల్లిందని బిల్డప్ ఇస్తూ కలరింగ్ ఇస్తున్న నేపథ్యం. కానీ నేలకొండపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీ ఎస్సీ కాలనీ ప్రాంతంలో నిర్మించిన వెంచర్లొ ఎన్ఎస్పి కాలువలను సైతం కబ్జా చేసి వెంచర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక ఈ వెంచర్లో గ్రీన్ బెల్ట్ ను సైతం ఎగ్గొట్టారని ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ అర్ధబలం అధికార బలం తోడవడంతో అవినీతి అలవాటు పడిన అధికారులు అడ్డుకోకపోగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దీంతో వ్యాపారం నిర్వహించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నేలకొండపల్లి సీతారామ వెంచర్ నిర్వాహకులు ప్రభుత్వం కు ఒక మ్యాపును అందజేసి మరొక మ్యాప్ ప్రకారం గ్రీన్ బెల్ట్ ను తక్కువగా వదిలినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాకా ఈ వెంచర్ నిర్వాహకులు ఇప్పటికీ రైతులకు భూమి కొనుగోలు చేసిన వ్యవహారంలో నగదు చెల్లించలేదని ప్రవేట్ పంచాయతీలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. అంతేకాక కొత్త కొత్తూరు సమీపంలోని వెంచర్ల నిర్మాణం జరిగింది. దీంట్లో రెండు ఎకరాల్లో వెంచర్ నిర్మాణం చేసిన నిర్వాహకులు కేవలం 500 గజాలను మాత్రమే గ్రీన్ బెల్ట్ స్థలంగా వదిలి గజం అయిదు వేలకు 6000 కు అమ్మకాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎన్ఎస్పి స్థలాన్ని సైతం కబ్జా చేసి ఎటువంటి దారి సౌకర్యం లేని స్థలాన్ని ప్లాట్లుగా చేయడం అధికారుల అండదండలతో జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ వెంచర్నిర్మానంపై సమాచార హక్కు ద్వారా ఓ సామాజిక కార్యకర్త దరఖాస్తు చేయగా ఎన్ఎస్పి స్థలం ద్వారా దారి తీయకూడదని అధికారికంగా దృవీకరణ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ దర్జా ఎన్ఎస్పి స్థలాన్ని రహదారిగా మార్చి 30 పైగా ప్లాట్లు అమ్మకాలు జరిపినట్లు దీంతో లక్షల రూపాయలు అర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు అలవాటు పడిన బడా బాబులు స్థానిక పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఇటీవల నిర్మించిన ఓ భవన నిర్మాణంలో ఓ మతానికి సంబంధించిన స్థలం కలిసిందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. కాగా ఎటువంటి అనుమతులు లేని ఇష్టానుసారంగా పంట బఫర్ జోన్లు దేవుడు మాన్యం అసైన్మెంట్ భూమి రహదారిని సైతం దారి మళ్లించి కోటి రూపాయల స్థలాన్ని ఓ వెంచర్ నిర్వాహకులు కాజేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా నేషనల్ హైవే రోడ్డు పక్కనఓ వెంచర్లొరెండు పంట కాలువలు దేవుడు మాన్యం భూమి ఉన్నట్లు కొందరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా స్పందించిన కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఎన్ ఎస్ పి అధికారులు కబ్జాకు గురైన వెంచర్ను పరిశీలించి బోర్డులు ఏర్పాటు చేయగా కలెక్టర్ ఆదేశాల మేరకు పవర్ బంకుఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చినట్లు కానీ కేటాయించిన స్థలం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కినట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నేలకొండపల్లి మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ వెంచర్లపై సమగ్ర విచారణ చేసి నిజ నిర్ధారణ చేసి రికార్డుల ప్రకారం వెంచర్లు బఫర్ జోన్లు పంట కాలువలు గ్రీన్ ఫీల్డ్ లాంటివి కేటాయించారా లేదా అనేది సమగ్రంగా పరిశీలించి అక్రమాలకు పాల్పడిన వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని మండల ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333