రిజర్వేషన్‌ అమలుపై TGPSCకి హైకోర్టు నోటీసులు

Aug 30, 2024 - 18:18
 0  5
రిజర్వేషన్‌ అమలుపై TGPSCకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌:ఆగస్టు 30: తెలంగాణ గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ వ్యవహారంలో రిజర్వే షన్ల అమలుపై హైకోర్టు టీజీపీఎస్సీకి, ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్ల అమలు చేస్తున్న విధానంపై వివరణ ఇవ్వా లంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబరు 27వ తేదీకి వాయిదా వేసింది. 

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి జీవో 55కు సవరణ తీసుకువస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ను సవాలు చేస్తూ.. ఎం హనుమాన్‌తోపాటు మరో ముగ్గురు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిని విచారించిన జస్టిస్‌ కె శరత్‌ ఇరువర్గాల వాదనలు విన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు విని పిస్తూ.. గ్రూప్‌-1 మెయిన్స్‌ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థు ల ఎంపికకు సంబంధించి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించలేదని అన్నారు. 

మొత్తం 563 పోస్టులకు జనరల్‌ కేటగిరీలో 209, ఈడబ్ల్యూఎస్‌ 49, బీసీ(ఏ) 44, బీసీ (బీ)37, బీసీ(సీ) 13, బీసీ(డీ) 22, బీసీ(ఈ) 16, ఎస్సీ 93, ఎస్టీ 52, క్రీడాకారులు 4, దివ్యాంగులు 24 పోస్టులు చొప్పున ఉన్నాయని పేర్కొన్నారు. 

ప్రతి కేటగిరీలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో టీజీపీ ఎస్సీ నిబంధనలు పాటించ లేదని వ్యాఖ్యానించారు. తద్వారా రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని కోర్టుకు వివరించారు. 

కొన్ని విభాగాల్లో 1:50 నిష్పత్తి దాటిందని పేర్కొ న్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయమూర్తికి వాదనలు వినిపించారు. 

పిటిషనర్‌ తరపు న్యాయ వాది వాదన లను విన్న న్యాయమూర్తి వివరణ కోరుతూ ప్రభు త్వానికి, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు నోటీసులు జారీ చేశారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333