ప్రమాదపు అంచుల్లో చిన్నోనిపల్లి ఆర్ఎండర్ సెంటర్

Aug 28, 2025 - 19:36
 0  7
ప్రమాదపు అంచుల్లో చిన్నోనిపల్లి ఆర్ఎండర్ సెంటర్

గద్వాల జోగులాంబ జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి R&R సెంటర్లో తృట్టిలో తప్పిన పెను ప్రమాదం
నిన్న సాయంత్రం గుర్తు తెలియని ట్రక్టర్ కరెంటు స్తంభానికి ఢీకొని రెండు కరెంటు స్తంభాలు విరిగిపడిపోయినాయి ఆ సమయంలో కరెంటు ఉన్నది, కానీ ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఎవరూ లేనందున చిన్నోనిపల్లి గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నోనిపల్లి R&R సెంటర్  ప్రజల ప్రాణలతో చెలగాటమాడుతున్న విద్యుత్ అధికారులు మా యొక్క చిన్నోనిపల్లి గ్రామానికి AB స్విచ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగినచో లేదా ఇంటికి కరెంటు కలెక్షన్ తీసుకోవాలన్న  లైన్మెన్ దగ్గర నుంచి AE, SE, జిల్లా స్థాయి విద్యుత్ అధికారులతో అనుమతి పొందాల్సిన పరిస్థితి దాపరించి ఉన్నది.  ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అధికారులు స్పందించి LC ఇచ్చే లోపల ఇక్కడ ప్రాణాలు గాలిలో కలిసిపోతానీ తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కున కాలం వెళ్లబోస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యుత్ అధికారులు స్పందించి ఏబీ స్విచ్  ఫిటింగ్ చేసి ప్రమాదల నుంచి తప్పించగలరని కోరుతున్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333